శ్రీ విష్ణు సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. ఆ స్థాయి హిట్ దక్కేనా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మం చి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు శ్రీ విష్ణు హీరో గా నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. శ్రీ విష్ణు హీరో గా నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన శ్రీ విష్ణు ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల వైపు , రొటీన్ సినిమాల వైపు వెళ్లకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ రావడంతో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు దక్కుతూ వస్తుంది. 


శ్రీ విష్ణు 2023 వ సంవత్సరం సామజవరగమన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో రెబా మోనిక జాన్ హీరోయిన్గా నటించగా ... రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందించే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది.


ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు కూడా శర వేగంగా జరుగుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే సామజవరగమన మూవీ కి సీక్వెల్ ను గనుక ప్లాన్ చేస్తే దానిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు. శ్రీ విష్ణు కొంత కాలం క్రితమే సింగిల్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: