మదరాసి: మురుగదాస్ బ్రైన్‌లో గుజ్జు అయిపోయిందా.. పెన్నులో ఇంకు అయిపోయిందా..!
మన సౌత్ సినిమా దగ్గర తనదైన సినిమాలతో ఎంతగానో అలరించిన దర్శకుల్లో ఏఆర్. మురుగదాస్ ఒకరు. రమణ, తుపాఖీ, గజని, హిందీ గజనీ లాంటి సినిమాలతో కేవలం కోలీవుడ్ .. సౌత్ ఇండియన్ సినీ ప్రేమికులు మాత్రమే కాదు... ఇండియన్ సినీ ప్రేమికులు కూడా ఆయనకు పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు. మంచి మెసేజ్ ని కమర్షియల్ సినిమాలతో అందించే దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కూడా ఒకరు. మరి మురుగదాస్ నుంచి గత కొంత కాలంగా వరుస పెట్టి ప్లాపులు వస్తున్నాయి. చివరగా విజయ్ హీరోగా వచ్చిన సర్కార్ సినిమ ఒక్కటి మాత్రమే హిట్ అయ్యింది. అందులోనూ కథ డెప్త్ ఉన్నా దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. చివరగా చూస్తే రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన దర్బార్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ - రష్మిక మందన్న కాంబినేషన్ లో తెరకెక్కించిన సికందర్ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మదరాసి సినిమా తెరకెక్కించారు.
యంగ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా చేసిన ఈ సినిమాతో మురుగదాస్ మళ్ళీ కం బ్యాక్ ఇస్తారు అని మురుగదాస్ అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. పైగా అమరన్ సినిమాతో శివ కార్తీకేయన్ రు. 300 కోట్లు కొల్లగొట్టారు. దీంతో వీరి కాంబినేషన్‌లో వచ్చిన మదరాసి సినిమా ఖచ్చితంగా సూపర్ గా ఉంటుందనే అనుకున్నారు. అయితే మరోసారి మురుగదాస్ ఫ్యాన్స్ ఇంకా వెయిటింగ్ చేయక తప్పని పరిస్థితి. మదరాసి సినిమాకి కూడా ఏమి పూర్తి పాజిటివ్ టాక్ ఎక్కడా రాలేదు. దీనితో మురుగదాస్ నుంచి మళ్ళీ తన రేంజ్ సినిమా వచ్చేందుకు సమయం ఇంకా ఉందనే చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు