సమంత – కాజల్ తర్వాత కొత్తగా దూసుకొస్తున్న బ్యూటీ క్లిక్కవ్వగలదా?
తెలుగులో కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో రుక్మిణి పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ తర్వాత వరుసగా వచ్చే అవకాశాలు ఆమెను బిజీ హీరోయిన్గా మార్చేశాయి.కన్నడలో ‘బానదారియల్లి’, ‘భగీర’, ‘భైరతి రణగల్’ వంటి సినిమాల్లో రుక్మిణి నటన మెప్పించగా, తమిళంలో ‘ఎస్’, తెలుగులో ‘అపుడో ఇపుడో ఎపుడో’ వంటి ప్రాజెక్టులలో కనిపించింది. ఇటీవల ‘మదరాసి’ సినిమాలో కూడా ఆమె తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రుక్మిణి కెరీర్‌ను మలుపు తిప్పేలా మూడు భారీ పాన్-ఇండియా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి నటిస్తోంది. అలాగే యష్ నటిస్తున్న ‘టాక్సిక్’, రిషబ్ శెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘కాంతారా చాప్టర్ 1’ సినిమాల్లో కూడా ఆమె ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది.
తారక్ సినిమా తెలుగు ఒరిజినల్ అయినా, యష్, రిషబ్ సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ అవ్వబోతున్నాయి. దీంతో రుక్మిణి పేరు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు "సామ్, కాజల్ రూట్లో దూసుకుపోతున్న రుక్మిణి.. ఇక టాలీవుడ్ నెక్ట్స్ స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో!" అంటూ కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి, బ్యాక్ టూ బ్యాక్ హిట్స్, భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్స్ రుక్మిణి చేతిలో ఉండటంతో ఆమె భవిష్యత్ స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో స్థిరపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సామ్ – కాజల్ రేంజ్లో ఈ బ్యూటీ క్లిక్ అవుతుందా? లేక మరింత ఎత్తుకు వెళ్తుందా? అన్నది రాబోయే కాలంలో తేలనుంది!