మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని నయన తార , చిరంజీవి కి జోడిగా కనిపించబోతుంది. బీమ్స్ సిసిరిలీయో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. పోయిన నెల ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోను విడుదల చేశారు.
అది ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఇకపోతే అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అత్యంత వేగంగా పూర్తి చేస్తే వస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మరియు మొత్తం పనులు వచ్చే సంవత్సరం సంక్రాంతి కి చాలా రోజుల ముందే కంప్లీట్ కానున్నట్లు , దానితో ఈయన చాలా రోజుల పాటు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 19 వ తేదీ నుండి ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ చాలా రోజుల పాటు సాగనున్నట్లు ఈ షెడ్యూల్ లో చిరంజీవి , నయనతార పై రెండు సాంగ్స్ ను కూడా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ షెడ్యూల్ లో చిత్రీకరించే సాంగ్స్ కి బీమ్స్ సంగీతం కూడా ఇచ్చినట్లు , ఆ రెండు పాటలు అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే మన శంకర వర ప్రసాద్ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.