బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కిష్కిందపురి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రాక్షసుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. చాలా కాలం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కిష్కింద పురి ఈ మూవీ హర్రర్ జోనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ మూవీ ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో ప్రేక్షకులకు భయం పుట్టించే సన్నివేశాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి సెన్సార్ బృందం నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది.
ఇకపోతే దాదాపుగా సినిమాకు "ఏ" సర్టిఫికెట్ వచ్చింది అంటే ఆ సినిమాలో రక్త పాతం భారీగా ఉండాలి లేదంటే ఆ మూవీ లో భయం కలిగించే సన్నివేశాలు అయినా ఉండాలి. ఈ మూవీ హర్రర్ జోనర్ సినిమా కాబట్టి ఈ సినిమాలో భయం కలిగించే సన్నివేశాలు చాలా ఉండడంతో ఈ మూవీ కి సెన్సార్ బోర్డు వారు "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు అని చాలా మంది భావిస్తున్నారు. మరి ఈ మూవీ భారీ స్థాయిలో ప్రేక్షకులను భయపెట్టినట్లయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు.