ఘాటి.. మదరాసి : ఓటిటి హక్కులు ఆ క్రేజీ సంస్థ చేతికి.. స్ట్రీమింగ్ కోసం అప్పటివరకు ఆగాల్సిందే..?
అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఘాటీ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాను కూడా కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓ టి టి సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మంచి అంచనాల నడమ విడుదల ఈ రెండు సినిమాలకు కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ దక్కింది.