అక్కడ ఇప్పుడే రికార్డులు సృష్టిస్తున్న యాష్ "టాక్సిక్".. రికార్డులు చెల్లాచెదురు కానున్నాయా..?

Pulgam Srinivas
కన్నడ నటుడు యాష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కొంత కాలం క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జీ ఎఫ్ చాప్టర్ 2 సినిమాలలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల కంటే ముందు యాష్ కి కేవలం కన్నడ సినీ పరిశ్రమలో మాత్రమే గుర్తింపు ఉండేది. ఈ రెండు సినిమాలు విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకోవడంతో యాష్ కి ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చింది.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం యాష్ "టాక్సిక్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. కే జీ ఎఫ్ చాప్టర్ 1 , కే జీ ఎఫ్ చాప్టర్ 2 లాంటి భారీ విజయాల తర్వాత యాష్ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటుంది.


ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు ఉండగానే బుక్ మై షో లో ఈ మూవీ కి అద్భుతమైన ఇంట్రెస్ట్ లు దక్కుతున్నాయి. బుక్ మై షో లో టాక్సిక్ మూవీ కి ప్రస్తుతం 200 కే ఇంట్రెస్ట్ లు లభించాయి. ఇలా ఈ మూవీ విడుదలకు చాలా రోజుల ముందే ఈ స్థాయి ఇంట్రెస్ట్ లు బుక్ మై షో లో లభించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి అనే అంచనాకు  చాలా మంది జనాలు వస్తున్నారు. మరి ఈ సినిమాతో యాష్ కి ఏ స్థాయి విజయం దక్కుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: