ఓజి విషయంలో అది మైనస్ కానుందా.. అదంతా అభిమానుల చేతుల్లోనే ఉంది..?

Pulgam Srinivas
పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే సినిమాలో హీరో గా నటించాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుండగా ... అర్జున్ దాస్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని డి వి వి దానయ్య నిర్మించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఓజి సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడంతో ఓ చిన్న విషయంలో పవన్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.


అది ఎందులో అనుకుంటున్నారా ..? సినిమా విడుదల తేది దగ్గర పడగానే కాస్త హంగామా మొదలు అయ్యి ఏదో ఒక తప్పు వల్ల అది జనాల్లోకి నెగటివ్గా వెళ్లడం , ఆ తర్వాత సినిమా బైకడ్ అనే ప్రచారం జరగడం ఈ మధ్య కాలంలో మనం భారీగా చూస్తూనే ఉన్నాం. పవన్ రాజకీయాల్లో ఉండడం వల్ల ఆయన ప్రఖ్యాతి పార్టీలు సినిమా గురించి ఏ కాస్త తప్పుడు వార్త బయటకు వచ్చిన సినిమా బైకడ్ అనే విషయాన్ని ఎక్కువ ప్రచారం చేసే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.


ఇక మరి కొంత మంది సినిమా బాగున్నట్లయితే ఎవరు బైకడ్ చేసినా అది ఆగదు. బైకడ్ అని పిలిపిచ్చినంత మాత్రాన సినిమా చూసేవారు అస్సలు ఆగరు. కాకపోతే సినిమాపై కాస్త నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం మాత్రమే ఉంటుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఓజి మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు గనక మంచి టాక్ వచ్చినట్లయితే బాక్సా ఫీస్ దగ్గర ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: