ప్రధాని మోదీకి కీలక విజ్ఞప్తి తెలిపిన నాగ్ అశ్విన్.. దర్శకుడి ఆలోచన సూపర్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో నాగ్ అశ్విన్ ఒకరు. ఈయన నాని హీరో గా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఈ సినిమా విమర్శకులను బాగా మెప్పించింది. ఈ మూవీ ద్వారా ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన మహానటి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ సక్సెస్ అయింది. దానితో ఈ సినిమా ద్వారా ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కొంత కాలం క్రితం ఈయన కల్కి 2898 AD అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.


ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ సినిమా ద్వారా ఈయనకు దేశ వ్యాప్తంగా దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా నాగ్ అశ్విన్ మన దేశ ప్రధాని అయినటువంటి మోదీ కి ఓ విషయంలో కీలక విజ్ఞప్తి చేశాడు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా మోదీ ప్రభుత్వం 100 రూపాయల లోపు సినిమా టికెట్ ధర ఉన్నట్లయితే దానిపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ విధిస్తున్నట్లు చెప్పుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. దీనిపై నాగ్ అశ్విన్ , మోదీ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తిని తెలియజేశారు. ఆయన మోదీ ప్రభుత్వానికి 100 రూపాయల లోపు 5 శాతం జీఎస్టీని విధించడం కంటే 250 రూపాయల లోపు టికెట్ ధరలు ఉన్న వాటిపై 5 శాతం జీఎస్టీ విధిస్తే చాలా బాగుంటుంది.


100 రూపాయల లోపు టికెట్ ధరలు ఉన్న థియేటర్లు చాలా తక్కువ ఉన్నాయి. 250 రూపాయల టికెట్ ధరలు ఉన్న వాటిపై 5 శాతం జీఎస్టీ విధించినట్లయితే సామాన్య , మధ్య తరగతి కుటుంబలకు సంబంధించిన వారు ఎక్కువ మంది సినిమా చూసే అవకాశం ఉంటుంది అని ఆయన మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇకపోతే తాజాగా 100 రూపాయల లోపు టికెట్ ధర ఉన్న వాటికి 12 శాతం జీఎస్టీ నుండి 5 శాతం కు తగ్గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: