మరోసారి చిక్కుల్లో మృణాల్.. ఆ స్టార్ బ్యూటీని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసిందా..?

Pulgam Srinivas
బాలీవుడ్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలలో మృనాల్ ఠాగూర్ ఒకరు. ఈమె హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ లో ఈమె షహీద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని సాధించకపోయిన ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది.


ఆ తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరో గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా పలు తెలుగు సినిమాలలో నటించి ఈ బ్యూటీ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల చిక్కుల్లో పడింది.


అసలు విషయం లోకి వెళితే ... తాజాగా మృనాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... గతంలో ఓ స్టార్ హీరో సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. కానీ ఆ ఆఫర్ ను నేను రిజెక్ట్ చేశా. ఆ సినిమా కనుక నేను చేసి ఉంటే అవకాశాలు కోల్పోయే దాన్ని. అందులో నటించిన హీరోయిన్ కి అద్భుతమైన స్టార్ డమ్ వచ్చిన ఇప్పుడు సినిమాలు చేయట్లేదు అని అన్నారు. దానితో చాలా మంది మృనాల్ ఠాకూర్  "సుల్తాన్" సినిమాలో నటించిన అనుష్క శర్మ గురించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసింది అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mt

సంబంధిత వార్తలు: