బ్రేకింగ్ న్యూస్: స్టార్ హీరో అల్లు అర్జున్ కుటుంబంలో తీవ్ర విషాదం!
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్నేహితులు పెద్ద ఎత్తున అరవింద్ గారి నివాసానికి చేరుకుంటూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. మెగా కుటుంబంలో కనకరత్నమ్మ గారి స్థానం ప్రత్యేకమైనది. ఆమె స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారికి అత్తగారు, సురేఖ గారికి తల్లిగారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అమ్మమ్మ. కుటుంబంలోని అన్ని వేడుకలు, ముఖ్య సందర్భాల్లో పెద్దరికం వహిస్తూ అందరికీ అండగా నిలిచిన కనకరత్నమ్మ గారు కుటుంబానికి ఆత్మీయతకు ప్రతీక. .
ప్రస్తుతం అల్లు అర్జున్ తన రాబోయే భారీ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ముంబైలో ఉండగా, రామ్ చరణ్ మైసూరు షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే వారు ఇద్దరూ షూటింగ్‌లను వదిలి మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చని సమాచారం. అలాగే నటుడు నాగబాబు కూడా రాజకీయ కార్యక్రమాల కోసం నగరానికి వెలుపల ఉన్నట్లు తెలుస్తోంది.
కనకరత్నమ్మ గారి మరణం వార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికలపై మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. "మన స్టార్ హీరో కుటుంబానికి దేవుడు బలం ఇవ్వాలి, ఈ కష్టకాలాన్ని తట్టుకునే ధైర్యం కలిగించాలి" అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగపూర్వక పోస్టులు పెడుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ ఆప్యాయతతో మెలిగిన అల్లు కనకరత్నమ్మ గారు ఇకలేరనే వార్తతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.