పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ సినిమా కలెక్షన్లు ఏ లెవెల్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆయన నుండి
సినిమా వస్తుంది అంటే చాలు ఆ
సినిమా కలెక్షన్లు మొదటి రోజే 100 కోట్లకు పైగా ఉంటాయి అని అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అలాంటి
ప్రభాస్ సినిమా కలెక్షన్స్ ని కూడా బీట్ చేసింది ఒక చిన్న సినిమా. అందులో అసలు
హీరో లేడు..
హీరోయిన్ లేదు.. ఓ ఐటెం సాంగ్ లేదు..రొమాన్స్ లేదు.. కానీ ఈ సినిమాను చూడడానికి మాత్రం ప్రేక్షకులు థియేటర్ లకు క్యూ కడుతున్నారు.అదే మహావతార్ నరసింహ.. యానిమేషన్ మూవీగా తెరకెక్కిన మహావతార్
నరసింహ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది.
ఇప్పటికీ ఈ
సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ఈ
సినిమా విడుదలై నెల రోజుల దగ్గర పడుతున్నా కూడా ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ
సినిమా కలెక్షన్స్ విషయంలో
ప్రభాస్ రెండు సినిమాలను దాటేసి రికార్డు సృష్టించింది.అవేంటంటే ..ప్రభాస్ నటించిన సలార్
మూవీ హిందీలో 153 కోట్ల కలెక్షన్స్ చేసింది. అలాగే
సాహో మూవీ 150 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ రెండు సినిమాల కలెక్షన్లను మహావతార్
నరసింహ సినిమా 25 రోజుల్లో దాటవేసింది.
25 రోజుల్లో ఈ
సినిమా 160 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సింహగర్జన చేస్తోంది. ఇప్పటికే ఈ
సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వసూళ్లకు చేరువైంది.అలాగే ఈ యానిమేషన్ వండర్ మహావతార్
నరసింహ మూవీ థియేటర్లలో ఇలాగే కొనసాగితే కచ్చితంగా 200 కోట్లు ఈజీగా కొట్టేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.మరి చూడాలి ఈ
సినిమా ఇంకా ఎలాంటి రికార్డులు సంచలనాలు సృష్టిస్తుందో. ఏది ఏమైనప్పటికీ
హీరో హీరోయిన్ ఎవరు లేకుండానే ఈ
సినిమా రికార్డులు క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు.