2002లో విడుదలైన `మన్మథుడు` మూవీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది అన్షు. మూవీ ఫ్లాష్ బ్యాక్ లో హీరో నాగార్జునకు జోడిగా తనదైన అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేకపోయింది.
మన్మథుడు తర్వాత ప్రభాస్ తో `రాఘవేంద్ర`, `మిస్సమ్మ` వంటి చిత్రాల్లో మెరిసి కనుమరుగైంది. సచిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని లండన్‌లో సెటిల్ అయింది. ఈ దంపతులకు ఒక కూతురు కూడా జన్మించింది. అయితే సుమారు రెండు దశాబ్దాల విరామం అనంతరం అన్షు మళ్ళీ యాక్టింగ్ పై మనసు పారేసుకుంది.
ఇటీవల `మజాకా` మూవీతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్, రావు రమేష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు. రావు రమేష్ కు జోడిగా అన్షు కనిపించింది. అయితే మజాకా మూవీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో.. అన్షుకు సరైన రీఎంట్రీ అనేది లభించలేదు.
సెకండ్ ఇన్నింగ్స్ లో చెలరేగిపోవాలని భావించిన మన్మథుడు బ్యూటీకి నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే.. తాజాగా అన్షు గ్లామర్ షోకు తెర తీసింది. బికినీలో నెట్టింట మంటలు రేపింది. నాలుగు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందాలతో నెటిజన్లకు మతిపోగొట్టింది.
ఇంకా చెప్పాలంటే కుర్ర హీరోయిన్లను కూడా డామినేట్ చేసేసింది. అన్షు లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు నెటిజన్లు వావ్, స్టన్నింగ్ అంటూ అన్షు అందాలను ఆకాశానికి ఎత్తేస్తుంటే.. మరికొందరు ఈ తెగింపు సినిమా అవకాశాలను అందుకోవడం కోసమే అని అభిప్రాయపడుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు