సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుష్కకు స్టార్ హీరోలతో సమానంగా స్టార్డమ్ సంపాదించి పెట్టిన చిత్రం `అరుంధతి`. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఆ హారర్ థ్రిల్లర్ 2009లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏడు నంది అవార్డులను గెలుచుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మంచు ఊపు తీసుకొచ్చింది. అనుష్కకు తీరుగులేని ఇమేజ్‌ను అందించింది. అయితే అరుంధతిలో చిన్నప్పటి అనుష్కకు నృత్యం నేర్పే డ్యాన్స్ టీచర్ గుర్తుందా? ఆమె పేరు లీనా సిద్ధు.
హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. అరుంధతి సినిమాలో లీనా కనిపించేది కొద్దిసేపే అయినా.. తనదైన అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. పశుపతి దుర్మార్గానికి బలైపోయే చూపులేని డ్యాన్స్ టీచర్ పాత్రలో లీనా అద్భుతంగా ఒదిగిపోయింది. అయితే రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా లీనా సిద్ధు క్లాసికల్ డ్యాన్సరే. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన లీనా.. ఆ తర్వాత నటిగా మారింది. తెలుగులో కావ్య’స్ డైరీ, లంక, హ్యాపీ హ్యాపీగా వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ, అరుంధతి రేంజ్‌లో ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.
బాలీవుడ్ లోనూ అడపా తడపా చిత్రాల్లో నటించినప్పటికీ.. లీనా వెండితెరపై అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె `లీనా సిద్ధు వ్లాగ్స్` పేరుతో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తుంది. అలాగే లీనాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఫారెన్ ట్రిప్స్ మాత్రమే కాకుండా తరచూ పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తుంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఇకపోతే లీనా ప్రజెంట్ లుక్ చూసి నెటిజన్లకు మతిపోతుంది. సినిమాలు చేయకపోయినా లీనా తన గ్లామర్ ను మాత్రం చక్కగా కాపాడుకుంటోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు