విజయ్ కింగ్డమ్ కొత్త కంటెంట్ సిద్ధం .. ఆ విషయంలో మాత్రం నో క్లారిటీ..?

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇక మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో గా .. స్టార్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ .. ఇక ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కి రావాల్సి ఉన్న అనుకోని కారణాల వల్ల ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఇప్పుడు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా .. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది ..



ఈ సినిమా మేకర్స్ అయితే ఇప్పుడు నేరుగా కొత్త కంటెంట్ ని సిద్ధం చేస్తారట .. ఈ సినిమా ట్రైలర్ కట్ ను ప్రస్తుతం లాక్ చేసినట్టు తెలుస్తుంది .. ఇక దీనితోనే కింగ్డమ్ రిలీజ్ డేట్ ఎప్పుడూ అనేది కూడా అనౌన్స్ చేయబోతున్నారట .. అలాగే దీని పై అధికారిక క్లారిటీ కూడా రావాల్సి ఉంది . ఇక ఈ సినిమా కి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించగా .. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు .. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది .. అలాగే గతంలో నటించిన విజయ్ దేవరకొండ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ లేకపోవడం తో .. కింగ్డమ్ ఫై రౌడీ హీరో భారీ ఆశలు పెట్టుకున్నాడు . ఇక మరి విజయ్‌ ఆశలు కింగ్డమ్ ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి ..



ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: