కెరియర్ స్టార్టింగ్ లో నన్ను అలంటి నటిగా చూశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ నటి..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చినట్లయితే అలాంటి వారికి అనేక కష్టాలు ఎదురవుతాయి అని , అవకాశాలు రావడం కూడా చాలా కష్టం అవుతుంది అని అనేక మంది చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఓ నటి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడం వల్ల నేను అనేక కష్టాలను ఎదుర్కొన్నాను అని , అలాగే తనకు కెరియర్ ప్రారంభంలో ఎదురైన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ నటీమణులలో ఒకరు అయినటువంటి ఫాతిమా సనా షేక్.


ఈ నటి ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించింది. ఈమెకు కెరియర్ ప్రారంభంలో ఆమీర్ ఖాన్ హీరోగా రూపొందిన దంగల్ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమెకి వరుస పెట్టి హిందీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మెట్రో ఇన్ దినో అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ నటి తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... నేను నటిగా కెరియర్ను ప్రారంభించిన కొత్తలో నన్ను చాలా మంది సెకండ్ గ్రేట్ నటిలా చూసేవారు అని చెప్పింది. 


కానీ నేను మాత్రం జూనియర్ ఆర్టిస్టు నుండి మొదలు కొని హీరోల వరకు అందరినీ సమానంగా చూసే దానిని అని చెప్పుకొచ్చింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే నటీనటుల్ని కొంత మంది చులకనగా చూస్తారు అని , ఆ బాధను నేను కూడా అనుభవించాను అని , అలాంటి బాధను ఎవరు కూడా అనుభవించకూడదు అంటూ ఈమె తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Fss

సంబంధిత వార్తలు: