రీ రిలీజ్‌లో హైదరాబాద్ గడ్డ .. మహేష్‌బాబు అడ్డా... !
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల హంగామా నడుస్తోంది. ఒకప్పటి పాత .. క్లాసిక్ సినిమాలు మాత్రమే కాదు .. ప్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తూ వాటికి భారీ కలెక్షన్లు వస్తుండడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్లాప్ సినిమాలు కూడా ఇప్పుడు హిట్ అవుతున్నాయి. ఉదాహరణకు ధనుష్ - శృతీహాసన్ 3 సినిమా .. తాజాగా మహేష్ బాబు - త్రివిక్రమ్ ఖలేజా సినిమా కూడా రీ రిలీజ్ లలో దుమ్ము దులిపేశాయి. ఇక రీ రిలీజ్ ల పరంగా చూస్తే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వసూళ్ల పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తిరుగులేని రారాజుగా ఉన్నాడు. మహేష్ నటించిన 5 సినిమాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రీ రిలీజ్ పరంగా టాప్ - 10 లో ఉండి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రీ రిలీజ్‌లో అత్యధిక వసూళ్లు రాబ్టటిన టాప్ - 10 సినిమాలు ఇవే..
1 ) ఖలేజా - 42 . 31 లక్షలు
2 ) గబ్బర్‌సింగ్ - 42 . 25 లక్షలు
3 ) మురారి - 31 . 86 లక్షలు
4 ) బిజినెస్‌మేన్ - 30 . 05 లక్షలు
5 ) ఆర్య 2 - 28 లక్షలు
6 ) సింహాద్రి - 24 . 42 లక్షలు
7 ) ఇంద్ర - 19 . 10 లక్షలు
8 ) దేశముదురు - 17 . 14 లక్షలు
9 ) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - 17 లక్షలు
10 ) ఒక్కడు - 16 . 09 లక్షలు
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు