లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా థగ్ లైఫ్ అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ లో
త్రిష హీరోయిన్గా నటించగా ... శంభు ఈ
మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ
మూవీ భారీ అంచనాల నడుమ
జూన్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాను
జూన్ 5 వ తేదీనే తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. ఇకపోతే మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ
మూవీ మొదటి రోజు పెద్ద ఎత్తున కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయడంలో విఫలం అయింది. ఈ మూవీకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 36 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 8 లక్షలు , ఆంధ్ర లో 60 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ
మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.04 కోట్ల షేర్ ... 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 11 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ
మూవీ 12 కోట్ల టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 10.96 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయవలసి ఉంది. మరి ఈ
సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.