పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ హీరోగా
నిధి అగర్వాల్ హీరోయిన్గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే
సినిమా మొదలు అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి ఎం ఎం
కీరవాణి సంగీతం అందించగా ... ఈ
మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఏ ఏం రత్నం నిర్మించాడు. ఈ
సినిమా షూటింగ్ చాలా సార్లు ఆగిపోతూ వచ్చింది. ఈ
మూవీ దర్శకత్వ భాద్యతల నుండి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు. దానితో
జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ
మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ
మూవీ ని
జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొంత కాలం క్రితం ప్రకటించారు.
కానీ తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాను
జూన్ 12 వ తేదీన విడుదల చేయడం లేదు అని , మరో కొత్త తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తాం అని ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ దర్శకుడు అయినటువంటి
జ్యోతి కృష్ణ ఈ
మూవీ కి ఎంత బడ్జెట్ ఖర్చు అయ్యింది ..? అలాగే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజాగా
జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ... హరిహర వీరమల్లు సినిమాకు 250 కోట్ల బడ్జెట్ ఖర్చు అయ్యింది అని చెప్పాడు. అలాగే ఈ
మూవీ లో బందర్ పోర్టుకు సంబంధించిన ఒక సన్నివేశం ఉంటుంది అని , అక్కడ వచ్చే యాక్షన్ సన్నివేశం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ సినిమాలోని బందర్ పోర్టు సన్నివేశం గురించి రెండు సంవత్సరాలు కష్ట పడినట్లు కూడా
జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కూడా హరిహర వీరమల్లు సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ ఎత్తున అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ
సినిమా కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో అనే దానిపై పవన్ అభిమానుల్లో అత్యంత ఆసక్తి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది.