అయోమయంలో `కింగ్‌డ‌మ్‌` మేక‌ర్స్‌.. ఫ్యాన్స్‌కు షాక్ త‌ప్ప‌దా?

Kavya Nekkanti
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `కింగ్‌డ‌మ్`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి ఈ చిత్రం మే 30న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల‌తో జూలై 4వ తేదీకి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి కూడా రావ‌డం క‌ష్ట‌మే అన్న ప్ర‌చారం నెట్టింట న‌డుస్తోంది.


లెంగ్త్ ఇష్యూస్ త‌లెత్త‌డంతో క్రిస్పీ వెర్షన్ రెడీ చేశార‌ట‌. ఇది వెర్ష‌న్‌ సంతృప్తి ప‌ర‌చ‌క‌పోవ‌డంతో రీషూట్ కు వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అలాగే పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లోనే ఉంది. మ‌రోవైపు కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ తన వర్క్ కంప్లీట్ చేయ‌డానికి ఇంకాస్త ఎక్కువ టైమ్ కావాలని అడిగాడ‌ట‌. దాంతో కింగ్‌డమ్ మేక‌ర్స్ అయోమ‌యంలో ప‌డ్డార‌ని ఇన్‌సైడ్ టాక్.


ఈ ప‌రిణామాల న‌డుమ జూలై 4వ తేదీన విడుద‌ల కావాల్సిన కింగ్‌డ‌మ్ మూవీ ఆగ‌స్టుకు వాయిదా ప‌డొచ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్లే అవుతుంది. కాగా, స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న కింగ్‌డ‌మ్ లో విజ‌య్‌ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. స‌త్య‌దేవ్ ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.  


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: