సంక్రాంతి సీజన్ ను గుర్తు చేయబోతున్న జూన్ !

Seetha Sailaja
సాధారణంగా సంక్రాంతి సీజన్ కు భారీ అంచనాలతో నిర్మాణం అయిన భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవ్వడం పరిపాటి. సంక్రాంతి సీజన్ విజేత పై ఇండస్ట్రీ వర్గాలలో అత్యంత ఆశక్తి ఉంటుంది. ఈ సీజన్ తరువాత జనం ఎక్కువగా సినిమాలు చూసేది సమ్మర్ సీజన్ లో. అయితే ఈసారి సమ్మర్ సీజన్ లో ప్రేక్షకులు చూడటానికి సినిమాలు కరువైపోయాయి.



సమ్మర్ ముగిసిపోయి మాన్ సూన్ ఎంటర్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాకాలం ప్రారంభం అయింది. దీనికితోడు వచ్చే వారం నుండి స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి. ఒక విధంగా జూన్ నెల భారీ సినిమాలకు పెద్ద అనుకూలమైనది కాదు. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా సుమారు 1000 కోట్లు బిజినెస్ జరుపుకున్న నాలుగు భారీ సినిమాలు ఈనెల విడుదల అవ్వడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.



జూలై మొదటివారంలో ‘భైరవం’ హడావిడి కనిపించబోతోంది. ఈసినిమాతో పోటీ చిన్న సినిమా అయిన ‘షష్టిపూర్తి’ కూడ వస్తోంది. ఈ రెండు సినిమాలను లెక్క చేయకుండా గతంలో మహేష్ నటించిన ‘ఖలేజా’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈసినిమా టిక్కెట్స్ కు బుక్ మై షోలో వస్తున్న స్పందన చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. జూన్ 5న ‘ధగ్ లైఫ్’ విడుదల అవుతూ ఉండటంతో ‘భైరవం’ ధియేటర్లు ఖాళీ చేయవలసిన పరిస్థితి.



ఆసినిమా హిట్ అయితే కనీసం మూడు నాలుగు వారాలు కలక్షన్స్ ఉంటాయి. ఈసినిమా వచ్చిన కేవలం ఐదు రోజుల గ్యాప్ తో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రాబోతోంది. ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే కలక్షన్స్ సునామీ వస్తుందని పవన్ అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఈసినిమా వచ్చిన కేవలం వారం రోజుల గ్యాప్ తో నాగార్జున ధనుష్ లు ‘కుభేర’ వస్తోంది. ఆతరువాత జూన్ 27న మంచు విష్ణు ‘కనప్ప’ రిలీజ్ అవుతోంది. ఇన్ని భారీ సినిమాల మధ్య ఏసీనిమా హిట్ అన్నది వేచి చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: