తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపు సంపాదిస్తారు. ఇక నేటి కాలంలో అనేకమంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ సాధిస్తున్నారు. ఒకప్పటి కాలంలో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి హీరోయిన్లలో ప్రముఖ నటి స్నేహ ఒకరు. ఈ భామ తెలుగులో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది.
ఎంతోమంది పెద్దపెద్ద హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందింది. స్నేహ తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం భాషా సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. స్నేహకు విపరీతంగా అభిమానులు ఉండేవారు. తన సినిమా వస్తుందంటే చాలు ఎగబడి చూసేవారు. చాలా మంది అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్ గా స్నేహ మారిపోయింది. ప్రస్తుతం స్నేహ హీరోయిన్ గా కాకుండా అక్క, వదిన లాంటి పాత్రలను పోషిస్తూ ఇప్పటికీ సినిమాలలో నటిస్తున్నారు. వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ కొనసాగిస్తోంది.
స్నేహ సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే నటుడు ప్రసన్నను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా స్నేహ సినిమాలలో నటిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం కొనసాగించిందని అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా వారిద్దరు వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారట. అనంతరం ఏమైందో తెలియదు చాలా తక్కువ సమయం లోనే బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత స్నేహ వివాహం చేసుకొని సంతోషంగా తన లైఫ్ కొనసాగిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం స్నేహకు సంబంధించి ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.