తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ హీరోయిన్లుగా వారి హవాను కొనసాగిస్తున్నారు. అలాంటివారిలో ప్రముఖ నటి టబు ఒకరు. ఈ భామ అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు తన కెరీర్ లో అనేక సినిమాలలో నటించిన ఈ అమ్మడు తన నటన, అందచందాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
టబూ తెలుగులో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. గత కొన్ని రోజుల క్రితం టబూ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అనంతరం అలా వైకుంఠపురం సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ ఈ కేవలం తల్లి, అక్క, వదిన లాంటి పాత్రను మాత్రమే పోషిస్తుంది. టబు వయసు 50కి పైనే ఉన్నప్పటికీ ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది.
కానీ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తున్న సమయంలో ఎంతోమంది పెద్దపెద్ద స్టార్ హీరోలతో రిలేషన్ పెట్టుకుందని అనేక రకాల వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఓ స్టార్ హీరోను వివాహం చేసుకోవాలని కూడా అనుకుందట. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించడంతో వారు నిరాకరించారట. కానీ ఆ హీరోకు ఇదివరకే వివాహం జరిగింది.
వివాహమైనప్పటికీ టబుతో మళ్ళీ ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ అక్కడితోనే ఆగిపోయింది. ఆ కారణం వల్లే టబు ఎవరిని వివాహం చేసుకోలేదని ఓ వార్త వైరల్ అవుతుంది. కానీ 50 ఏళ్ల వయసులో టబు ఓ హీరోపై ప్రేమను పెంచుకుంటుందట. ఆ హీరోను వివాహం చేసుకోవాలని కోరుతుందట. కానీ ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం బయటికి రాలేవు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ టబుకు సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది.