రెండోసారి తల్లి కాబోతున్న అలియా భట్..బేబీ బంప్ ఫొటోస్ లీక్..?

Pandrala Sravanthi
ఏంటి బాలీవుడ్ నటి అలియా భట్ నిజంగానే రెండోసారి తల్లి కాబోతుందా.. ఇప్పటికే రాహా కు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ తల్లి కాబోతుందా.. ఇది నిజమేనా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటి అలియా భట్ ఆర్ఆర్ఆర్ మూవీ తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా కేన్స్ ఫీల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది.. ఇక ఇందులో మొదట షియా పరేలి ఫ్రాక్ ధరించి ఆ తర్వాత లోరియల్ పారిస్ లైట్స్ ఆన్ విమెన్ వర్త్ అనే ఈవెంట్ కి ఆర్మాని ఫ్రైవ్ డ్రెస్ వేసుకుంది.. ప్రస్తుతం ఈ రెండు డ్రెస్సుల్లో అలియా భట్ లుక్ వైరల్ అవుతుంది. 


ముఖ్యంగా ఈ ఫొటోస్ వైరల్ అవ్వడమే కాకుండా అలియా భట్ బేబీ బంప్ లీక్ అయింది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న అలియా భట్ ని చూసి కొంతమంది ఫ్యాన్స్ రెడ్డిట్లో షాకింగ్ పోస్టులు పెడుతున్నారు. అలియా భట్ పొట్ట అలాగే ఫేస్ పూర్తిగా మారిపోయింది. ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వడానికి రెడీగా ఉందా.. మళ్ళీ తల్లైందా అంటూ రెడ్డిట్లో ఒక పోస్ట్ చేశారు.


అయితే ప్రెగ్నెన్సీ లో ఆడవాళ్ళ ఫేస్, బాడీ షేప్ ఎలా మారిపోతుందో అందరికీ తెలిసిందే. ఇక అలియా భట్ ఫేసులో కూడా అలాంటి చేంజెస్ కనిపించడంతో చాలామంది నెటిజన్స్ మళ్లీ తల్లి కాబోతున్నట్టు ఊహగానాలు వైరల్ చేస్తున్నారు. మరి ఆ ఊహగానాల్లో ఉన్నది ఎంత నిజమో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.ఇక రీసెంట్గా రన్బీర్ కపూర్ కూడా ఓ పాడ్ కాస్ట్ లో తనకు మొదట కూతురు పుట్టింది.ఇప్పుడు కొడుకు పుట్టాలి అంటూ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: