టాలీవుడ్‌ను నాశనం చేసేందుకే ఈ మాఫియా పని చేస్తోందా ?
టాలీవుడ్ లో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ థియేటర్లో మూసివేత ఆలోచన ఎవరికి వచ్చిందో ? కానీ తమను తాను గొయ్యి తీసి పాతిపెట్టుకుంటున్నామని టాలీవుడ్ పెద్దలకు ఈ ఆలోచన రాకపోవటం విచిత్రమే అన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇప్పటికే థియేటర్లకి వచ్చి చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. సినిమా థియేటర్స్ స్థాయిలో విజువల్ సౌండ్ అందించే పరికరాలు ఇళ్లల్లోకి వచ్చేసాయి. ఇలాంటి సమయంలో ఏమాత్రం నిర్వహణ సరిగా ఉండని థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. సింగల్ స్క్రీన్ వైపు అసలు రావటం లేదు. ఇలాంటి సమయంలో ఎవరినో బెదిరిద్దామని థియేటర్లు మూసివేత అన్న పాచిక వేశారు ఆ నలుగురు. అయితే ఇప్పుడు అది రివర్స్ అయ్యి కూర్చుంది. టాలీవుడ్ కొంతమంది గుప్పిట్లో ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ కొంత మంది ఎందుకు టాలీవుడ్ పై పట్టు పెంచుకుంటున్నారు అన్నది కూడా అందరికీ తెలుసు.
సింగిల్ స్క్రీన్ లను రెంటల్ విధానం లోకి తెచ్చి తాము థియేటర్లను లీజు కు తీసుకుని గుప్పిట్లో పెట్టుకున్నారు. పండుగ సీజన్లలో సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ థియేటర్లు ఎవరి చేతిలో ఉంటే వారు చెప్పిన సినిమాలకే ఎక్కువ థియేటర్లు వస్తాయి. ఆ వ్యక్తి డబ్బింగ్ సినిమా రిలీజ్ చేయాలనుకుంటే దానికి ఎక్కువ ధియేటర్లు దొరుకుతాయి. పండుగ సీజన్లో తెలుగు సినిమాకు తమిళనాడులో రెండు థియేటర్లు కూడా దొరకవు కానీ ఇక్కడ వందల థియేటర్లలో డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతోంది. థియేటర్ మాఫియా రాజకీయ కుట్రలు చేయటానికి తమ నెత్తిన తామే చేయి పెట్టుకుంది. తమ వ్యాపారం కోసం అందరి ప్రయోజనాలు పణంగా పెట్టేస్తుంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ లో ఎంతటి ఘోర పరిస్థితిలో ఉన్నాయో తాజాగా థియేటర్ల బంద్ నిదర్శనం అంటున్నారు. ఇటు థియేటర్లను గుప్పెట్లో పెట్టుకుని నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను.. చివరకు హీరోలను సైతం శాసించే వరకు ఈ మాఫియా వచ్చిదంటే వీళ్లు ఏ స్తాయిలో బరి తెగించారో అర్థమవుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు