అల్లు అర్జున్ - అట్లీ మూవీకి అదిరిపోయే టైటిల్.. బట్ అదే ప్రాబ్లమ్..!
ఇందులోనే `A22` మూవీ టైటిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమాకు `ఐకాన్`, `సూపర్ హీరో` అనే రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారట. అయితే ఐకాన్ టైటిల్ కథకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుందని అల్లు అర్జున్ తన అభిప్రాయం వ్యక్తం చేయగా.. అట్లీ కూడా అదే టైటిల్ వైపు మొగ్గు చూపుతున్నాడట. దాదాపుగా ఐకాన్ టైటిల్‌నే ఈ సినిమాకు ఫిక్స్ చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే టైటిల్ అదిరిపోయినప్పటికీ.. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. గతంలో ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు అల్లు అర్జున్ సైన్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. `ఐకాన్` టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ప్రారంభం కాకముందే ఆగిపోయింది.
అప్పట్లో ఐకాన్ టైటిల్ ను బన్నీ కోసం దిల్ రాజు రిజిస్టర్ చేయించారు. `కనబడుట లేదు` అనేది సబ్ టైటిల్. అఫీషియల్ పోస్టర్ సైతం విడుదలైంది. సినిమా ఆగిపోవడంతో టైటిల్ దిల్ రాజు వద్దే ఉంది. ఇప్పుడు `A22` మూవీకి సేమ్ టైటిల్‌ను ఖరారు చేసే యోచనలో మేకర్స్ ఉన్నారు. మరి అట్లీ-అల్లు అర్జున్ కోసం దిల్ రాజు ఐకాన్ టైటిల్ ను త్యాగం చేస్తారా? అన్నదే ముందున్న అనుమానం.