పవన్ వార్నింగ్ విషయంలో ఆ నలుగురు సైలెన్స్.. తోక జాడిస్తే కట్ చేసేశారుగా?!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా అనేక వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న విషయం మన అందరికీ తెలిసిందే . గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు , పెద్దలు మరియు నిర్మాతలు పెద్ద ఎత్తున చర్చలు నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో థియేటర్లు కొన్ని రోజుల్లోనే బంద్ కాబోతున్నాయి అని కూడా వార్తలు వచ్చాయి. కానీ థియేటర్స్ బంద్ కావడం విషయంపై పూర్తిగా స్పష్టత రావడం లేదు. ఓ వైపు టాలీవుడ్ స్టార్ హీరో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 వ తేదీన విడుదల కాబోతోంది.


ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మరి కొంత మంది పవన్ కళ్యాణ్ సినిమా విడుదల రెడీగా ఉన్న సమయంలో థియేటర్లను బంద్ చేయడం సాధ్యం అయ్యే విషయమైనా అనే వాదనలు వినిపిస్తూ ఉంటే , మరి కొంత మంది మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాకు నష్టం జరగడం కోసమే ఈ బంద్ ప్రతిపాదనను కొంత మంది ముందుకు తీసుకువస్తున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరకాలం అవుతుంది. అయినా మర్యాద పూర్వకంగా కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబును కలవలేదు.


అయినా కూడా మేము వాటిని ఎప్పుడు పట్టించుకోకుండా సినీ పరిశ్రమకి ఏమి కావాలో అవి సమకూర్చుతో వస్తున్నాము. టికెట్ల రేట్ల విషయంలో మేము వారికి ఎంతో మంచి చేశాము అని కూడా చెప్పుకొచ్చాడు. దీనితో అనేక మంది దెబ్బకు సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: