పవన్ వార్నింగ్ తో ఊహించని సమస్య.. వీరమల్లుకు రేట్లు పెంచడం సాధ్యమేనా?

Reddy P Rajasekhar
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై థియేటర్ల విషయంలో, టికెట్ రేట్ల విషయంలో ఒకింత కఠినంగా వ్యవహరించనున్నారు. సినిమాలకు సంబంధించి వ్యక్తిగతంగా ఎవరూ కలవవద్దని అవసరమైతే సంఘాల ప్రతినిధులు వచ్చి కలవాలని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వార్నింగ్ తో ఊహించని సమస్య ఎదురవుతోఒందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
పవర్ స్టార్ వార్నింగ్ నేపథ్యంలో హరిహర వీరమల్లుకు టికెట్ రేట్లు పెంచడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హరిహర వీరమల్లుకు సంబంధించి వ్యక్తిగతంగా ఏఎం రత్నం వచ్చి కలవడానికి, టికెట్ రేట్లు పెంచాలని కోరడానికి నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. అయితే తన సొంత మూవీ కావడంతో పవన్ ఈ సమస్యను ఎలా పరిష్కరించనున్నారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.
 
హరిహర వీరమల్లు మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేదు. జూన్ నెల 12వ తేదీన రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కానుంది. హరిహర వీరమల్లు డిజిటల్ డీల్ చాలా కాలం క్రితమే పూర్తి కాగా ఈ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ ఒకింత భారీ మొత్తం ఖర్చు చేసింది. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించడం జరిగింది.
 
నిధి అగర్వాల్ సినీ కెరీర్ కు సైతం ఈ సినిమా కీలకం కానుంది. రెండు భాగాలుగా హరిహర వీరమల్లు తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ హిట్టైతే మాత్రమే సెకండ్ పార్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. హరిహర వీరమల్లు బాక్సాఫీస్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి. పవన్ కళ్యాణ్ ఐదేళ్ల కష్టానికి తగ్గ ఫలితం హరిహర వీరమల్లు రూపంలో దక్కాలని సినీ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: