ఒకేసారి 5 గురు భామలతో రొమాన్స్ చేయనున్న అల్లు హీరో..?

Veldandi Saikiran

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన అభిమానుల ను ఆకట్టుకుంటూనే ఉంటాడు. తన సినిమాల ద్వారా అల్లు అర్జున్ సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైనే కలెక్షన్లను రాబట్టింది.


ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంత ఎక్కువ కలెక్షన్లను రాబట్టలేదు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమా షూటింగ్ కు సిద్ధమయ్యారు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఏఏ 22 సినిమా షూటింగ్ తొందర్లోనే ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక జూన్ నెలలో నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా మూడు పాత్రలను పోషించబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.


ఇందులో అల్లు అర్జున్ సరసన మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనేను ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతోంది. దీపికతో పాటు బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్, మృనాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. నాలుగవ హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేను అనుకుంటున్నారట. మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో కలిసి సినిమాలో నటించబోతున్నారు. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అట్లీ భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: