బంగారం విషయంలో మనోళ్లు మామూలు వాళ్ళు కాదు.. ప్రపంచంలోనే అంత శాతం మన దగ్గరే..?

Pulgam Srinivas
ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల ప్రజలు కూడా బంగారాన్ని ఎక్కువ శాతం సంపదలా భావిస్తూ ఉంటారు. అందుకోసమే ఎక్కువ శాతం బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ మన భారతదేశ ప్రజలు మాత్రం బంగారాన్ని కేవలం ఓ సంపదలా మాత్రమే కాకుండా సమాజంలో గౌరవం కోసం కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇకపోతే భారత దేశంలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి అంటే ఎంత పేదవారైనా సరే ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. దానితో పెళ్లిళ్ల సీజన్ వస్తే భారత దేశంలో బంగార కొనుగోలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఇలా కొంత మంది భారతీయులు బంగారాన్ని పెట్టుబడుల ఆలోచనలో కొనుగోలు చేస్తూ ఉంటే మరి కొంత మంది సమాజంలో హోదా మరియు కొన్ని అవసరాల కోసం కొనుగోలు చేస్తూ వస్తున్నారు. దానితో ప్రపంచంలో భారతీయులు కొనుగోలు చేస్తున్న బంగారు శాతం రోజు రోజుకు పెరిగి పోతున్నట్టు తెలుస్తుంది.


ఇకపోతే ప్రస్తుతం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారంలో 11 శాతం బంగారం భారతీయ మహిళల వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇది సుమారు 24 వేల టన్నుల బంగారానికి సమానంగా ఉండవచ్చు అని ఈ సంస్థ పేర్కొంది. అమెరికా , రష్యా , ప్రాన్స్ , ఇటలీ , జర్మనీ , స్విట్జర్లాండ్ దేశాల రిజర్వులో ఉన్న మొత్తం బంగారం కలిపిన మన భారతీయ మహిళల వద్ద ఉన్న గోల్డ్ కంటే తక్కువ అని తెలుస్తుంది. దీని ద్వారానే అర్థం అవుతుంది భారత దేశ ప్రజలు బంగార కొనుగోలుపై ఏ స్థాయిలో ఆసక్తిని చూపుతున్నారు అని. ఇలా బంగారాన్ని భారతీయులు పెట్టు బడిల ఆలోచించడం , అలాగే సమాజంలో గౌరవం కోసం కొనుగోలు చేయడంతో భారతదేశంలో అత్యంత ఎక్కువ బంగారం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: