చాలా సంవత్సరాల క్రితం
చిరంజీవి హీరో గా రూపొందిన జగదేక వీరుడు
అతిలోక సుందరి సినిమాను కూడా
అశ్వినీ దత్ నిర్మించాడు. ఈ
మూవీ 1990 సంవత్సరం మే 9 వ తేదీన విడుదల అయింది. ఈ
సినిమా విడుదల అయ్యి ఈ సంవత్సరం మే 9 వ తేదీకి 35 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దానితో ఈ
సినిమా విడుదల 35 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ
సినిమా కూడా అద్భుతమైన ఇంపాక్ట్ ను బాక్సా ఫీస్ దగ్గర చూపించింది. ఇకపోతే జగదేక వీరుడు
అతిలోక సుందరి సినిమాలో
శ్రీదేవి హీరోయిన్గా నటించగా ... ఆ సమయంలో స్టార్ దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ
మూవీ విజయంలో
ఇళయరాజా అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో
చిరంజీవి ,
శ్రీదేవి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఆ సమయంలో
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ
సినిమా రీ రిలీజ్ లో భాగంగా కూడా మంచి కలెక్షన్లను రాబట్టి
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఇంపాక్ట్ ను చూపించింది.