మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి
రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ
కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి
కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె తెలుగు సినీ
పరిశ్రమ వైపు అడుగులు వేసింది.
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఈమె
ఛలో అనే
మూవీ తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈమె అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్
హీరోయిన్ స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.
ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు తో పాటు
తమిళ్ ,
హిందీ సినిమాల్లో కూడా వరుసగా నటిస్తూ వస్తుంది. ఈమె నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈమెకు
ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. తాజాగా ఈ నటికి ఓ భారీ క్రేజ్ ఉన్న పాన్
ఇండియా సినిమాలలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం
జూనియర్ ఎన్టీఆర్ ,
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ
మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో ఓ కీలకమైన పాత్రలో
రష్మిక కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ
మూవీ లో
రష్మిక పాత్రకు సంబంధించిన కథను
ప్రశాంత్ ఈమెకు వినిపించగా ఈమెకు ఆ పాత్ర నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే వెలువడనునట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ నటి వరుస పెట్టి
హిందీ సినిమాలలో నటిస్తోంది. ఇప్పటికే ఈమె నటించిన
హిందీ సినిమాలలో చావా
మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఈమెకు
హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది.