తమిళ నటుడు
సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
సూర్య ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి
కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కూడా చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈయనకు
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉంది. లేకపోతే
సూర్య కొంత కాలం క్రితం
శివ దర్శకత్వంలో రూపొందిన కంగువా అనే సినిమాలో
హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ అనేక భాషలలో విడుదల అయిన ఈ
సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇలా అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా ప్లాప్ కావడంతో
సూర్య అభిమానులు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు.
సూర్య తాజాగా టాలెంటెడ్
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రేట్రో అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో
పూజా హెగ్డే ,
సూర్య కి జోడీగా నటించింది. ఈ
సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ రావడంతో ఈ
సినిమా కూడా పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయలేకపోతోంది. దానితో
సూర్య అభిమానులు మరోసారి పెద్ద ఎత్తున డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.
ఈ
మూవీ కి 11 రోజుల్లో నైజాం ఏరియాలో 1.46 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 46 లక్షలు , ఆంధ్ర లో 1.74 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 11 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.66 కోట్ల షేర్ ... 7.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ
మూవీ మరో 6.84 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.