కొన్ని సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు ,
మోహన్ బాబు హీరోగా అల్లుడు గారు అనే సినిమాని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ
సినిమా కథ మొత్తం పూర్తికాకముందు రాఘవేంద్రరావు , చిరంజీవితో నేను నీ కోసం ఒక కథ తయారు చేస్తున్నాను అని చెప్పి చిన్న లైన్ గా ఓ కథను వినిపించాడట. స్టొరీ సూపర్ గా ఉంది సార్ మొత్తం తయారు చేయండి
సినిమా చేద్దాం అని
చిరంజీవి అన్నాడట. ఆ తర్వాత రాఘవేంద్రరావు ఆ
సినిమా కథను మొత్తం తయారు చేశాడట. కథ మొత్తం తయారు అయ్యాక రాఘవేంద్రరావు , చిరంజీవికి
ఫోన్ చేసి నీకు కొన్ని రోజుల క్రితం ఓ కథ చిన్న లైన్ గా చెప్పాను కదా గుర్తుందా అని రాఘవేంద్రరావు , చిరంజీవిని అడిగాడట. దానితో
చిరంజీవి గుర్తుంది సార్ మొత్తం కంప్లీట్ అయ్యిందా
సినిమా స్టార్ట్ చేద్దాం అని అన్నాడట. దానితో రాఘవేంద్రరావు కథ పూర్తి అయ్యింది. కానీ ఆ కథలో నీకంటే వేరే
హీరో అయితే బాగుంటుంది అని అన్నాడట. దానితో ఎందుకు సార్ అని
చిరంజీవి , రాఘవేంద్రరావుని ప్రశ్నించగా ..? ఆ
మూవీ కథలో క్లైమాక్స్ లో
హీరో పాత్ర చనిపోయే సన్నివేశం ఉంటుంది. అలాంటి పాత్ర నీలాంటి స్టార్ ఈమేజ్ ఉన్న
హీరో చేస్తే సెట్ కాదు. మామూలు ఈమేజ్ ఉన్న హీరోతో ఆ
సినిమా చేస్తే
బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పాడట. దానితో
చిరంజీవి కూడా ఓకే అన్నాడట. ఇక
మోహన్ బాబుతో అల్లుడు గారు అనే టైటిల్ తో ఆ కథతో ఆ
మూవీ ని రూపొందించగా ఆ
సినిమా అద్భుతమైన విజయాన్ని కూడా అందుకున్నట్లు తెలుస్తుంది.