నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కయ్యాదు లోహర్

MADDIBOINA AJAY KUMAR
న్యాచురల్ స్టార్ నాని సినిమాలలో నటిస్తూ వరుస హిట్ లను అందుకుంటున్నాడు. హీరో నాని ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి. దీంతో ఈ నెల 1న హిట్ 3తో హీరో నాని ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ అందుకున్నాడు.

నాని త్వరలో ది ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరపైకి రానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ తెలీదు. ఈ సినిమా కోసం మొదట నటి కీర్తి సురేష్, బ్యూటీ సాయి పల్లవి, శ్రీ లీల వంటి హీరోయిన్ లను తీసుకుందామని అనుకున్నారంట. తర్వాత హిట్ 3 హీరోయిన్ శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట. కానీ తను ఎంపిక కాలేదట.

ఈ క్రమంలో ది ప్యారడైజ్ మూవీలో హీరోయిన్ గా నటించేందుకు ఓ యంగ్ హీరోయిన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న డ్రాగన్ మూవీ హీరోయిన్ కయ్యాదు లోహర్ ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నానికి జోడిగా ఈ హాట్ బ్యూటీ ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన ఫొటోస్ ని షేర్ చేస్తూ ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే సినిమాకి కాస్త కొత్తదనాన్ని అందించాలని కయ్యాదు లోహర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: