ఆప‌రేష‌న్ సింధూర్.. బాలీవుడ్ ` ఖాన్స్ ` నోరు మెద‌ప‌రేం..?

RAMAKRISHNA S.S.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్ర‌తీకారంగా భార‌త్ ` ఆపరేషన్ సింధూర్` పేరుతో పాకిస్థాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేల‌మ‌ట్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడుల్లో 100 మందికి పైగా టెర్రరిస్టులను భారత సైన్యం హ‌తమార్చింది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్‌పై ప్రశంసలు కురిపిస్తోంది. సినీ, రాజ‌కీయ‌, క్రిడా ప్ర‌ముఖులు ` జై హింద్`, ` భార‌త్ మాతా కీ జై` అంటూ జేజేలు ప‌లుకుతున్నారు. ఇండియన్ ఆర్మీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.


సినీ ప‌రిశ్ర‌మ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ర‌జ‌నీకాంత్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌మ్ముట్టి, క‌మ‌ల్ హాస‌న్‌, మోహ‌న్ లాల్‌, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాని.. ఇలా ప్ర‌తిఒక్క‌రూ ఆప‌రేష‌న్ సింధూర్ పై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కానీ బాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా చెప్పుకునే ఖాన్స్ మాత్రం  సింధూర్ పై స్సందించ‌లేదు. స‌ల్మాన్ ఖాన్‌, అమీర్ ఖాన్‌, షారుక్ ఖాన్‌.. వీరెవ్వ‌రూ ఇంత వ‌ర‌కు ఆప‌రేష‌న్ సింధూర్ కు మ‌ద్ద‌తుగా ఒక్క‌ ట్వీట్ కూడా చేయ‌లేదు.


ఇదే విష‌యం ఇప్పుడు ఆయా హీరోల అభిమానుల‌కు, సినీ ప్రియుల‌కు మింగుడుప‌డ‌టం లేదు. నార్త్ లో స‌ల్మాన్ ఖాన్‌, అమీర్ ఖాన్‌, షారుక్ ఖాన్ ల‌కు ఎటువంటి స్టార్డ‌మ్ ఉందో, ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అటువంటి ఖాన్లు భార‌త ప్ర‌భుత్వానికి స‌పోర్ట్‌గా ఉండాల్సిన టైమ్ లో సైలెన్స్ ను మెయింటైన్ చేయ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దేశం ప‌ట్ల‌, ఆర్మీ ప‌ట్ల బాలీవుడ్ ఖాన్ల‌కు ఉన్న గౌర‌వం ఏపాటితో ఇప్పుడు అర్థమ‌వుతుంద‌ని.. మీలాంటి హీరోలు భార‌త్ కు అవ‌స‌రం లేద‌ని సొంత అభిమానులే వారిపై దుమ్మెత్తిపోతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా స‌ద‌రు ఖాన్లు నోరు మెదుపుతారేమో చూడాలి.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: