ది రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ చేస్కోనే అప్‌డేట్ ఇది..!!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్‌లో ప్రస్తుతం వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. వరుసగా ది రాజాసాబ్ - కల్కి 2 - సలార్ 2 - స్పిరిట్ ఇలా స్ట్రాంగ్ గా ప్రభాస్ లైనప్ ఉంది. ఇక ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా “ ది రాజా సాబ్ ” . ఈ సినిమా పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి ప్రభాస్ నుంచి ఈ సినిమా ఫస్ట్ టైం మనోడి కెరీర్ లో ఎవర్ హారర్ థ్రిల్లర్ గా ది రాజా సాబ్ వస్తుండగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. టీజర్ ఎప్పుడు వస్తుంది ? రిలీజ్ ఎప్పుడు అని ఫ్యాన్స్ అందరూ ఒక్కటే ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు.
ఇక మే మిడిల్ లో సాలిడ్ అప్‌డేట్ ఉంటుందని దర్శకుడు మారుతి ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు. దీనికి కంటిన్యూ గా ఈ సినిమా టీజర్ పై ఓ పాజిటివ్ న్యూస్ బయటకి వచ్చింది. గత కొన్ని రోజులు నుంచి ప్రభాస్ విదేశాలలో ఉన్నాడు .. ఇక ప్రభాస్ ఇపుడు హైదరాబాద్ కి తిరిగి వచ్చిన వెంటనే ఈ సినిమా టీజర్ తాలూకా డబ్బింగ్ మొదలు పెడతాడట. దీంతో మేకర్స్ త్వరలోనే టీజర్ డేట్ అనౌన్స్ చేసి రిలీజ్ చేయడం ఉంటుందని .. ఆ వెంటనే ట్రైలర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ విషయం లో క్లారిటీ ఉంటుందని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు