ఏకంగా ఆ మూవీకి మూడో భాగాన్ని స్టార్ట్ చేయనున్న స్టార్ బ్యూటీ..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి తాప్సి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ హీరో గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో తాప్సీ తన నటనతో , అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమె అనేక క్రేజీ తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరుకుంది.


ఇలా తెలుగు లో ఈమెకు మంచి అవకాశాలు వస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ చూపింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ 2021 వ సంవత్సరం హసీన్ దిల్రుబా అనే సినిమాలో నటించింది. ఈ మూవీ నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ కి కొనసాగింపుగా ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా అనే మూవీ ని రూపొందించారు.


ఈ మూవీ ని 2024 వ సంవత్సరం నేరుగా నెట్ ఫిక్స్ ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేశారు. ఈ మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా మూడవ భాగాన్ని కూడా రూపొందించడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు , ఇందులో కూడా తాప్సి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: