టీజర్: భయపెట్టడానికి వస్తున్న స్క్విడ్ గేమ్ సీజన్ 3..!
స్క్విడ్ గేమ్ సీజన్ 2 ప్రేక్షకులలో మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదని క్వాలిటీ కూడా మిస్ అయ్యిందని ఎక్కువ భాషలలో స్ట్రిమింగ్ అయినా కూడా మొదటి సీజన్ స్థాయిలో వ్యూస్ ను రాబట్టుకోలేకపోయింది. మొదటి సీజన్ నుంచి రెండో సీజన్ రావడానికి మూడేళ్లు గ్యాప్ పట్టగా కానీ మూడవ సీజన్ కి కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే గ్యాప్ తీసుకొని మరి స్ట్రిమింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.స్క్విడ్ గేమ్ సీజన్ 3కి సంబంధించి తాజాగా టీజర్ ని విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్.
స్క్విడ్ గేమ్ సీజన్ 3ను ఏడాది జూన్ 27వ తేదీన స్ట్రిమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించారు. టీజర్ ను సైతం రిలీజ్ చేస్తూ ఎప్పటిలాగే టీజర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది మూడో సీజన్లో సరైన కథతో ఉండబోతుందని విశ్వాసం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులలో పడినట్లు తెలుస్తోంది. హ్వంగ్ దర్శకత్వంలో లీ జంగ్ జే ముఖ్య పాత్రలు నటిస్తూ ఉన్నారు.స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ కి చాలా అవార్డులు రివార్డులను కూడా అందుకున్నారట. సుమారుగా 94 దేశాలలో అత్యధికంగా వీక్షించబడిన సిరీస్ గా పేరు సంపాదించింది.