టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా అనేక సార్లు ఆగిపోతూ , స్టార్ట్ అవుతూ రావడంతో క్రిష్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దానితో కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన రూల్స్ రంజన్ మూవీ కి దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ మూవీ యొక్క దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన దర్శకత్వ బాధ్యతలను జ్యోతి కృష్ణ చూసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆచార్య సినిమా కోసం వేసిన సెట్ లో ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అలా చిరంజీవి హీరోగా రూపొందిన సినిమా సెట్ లో ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాపై పవన్ అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. హరిహర వీరమల్లు మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.