ఓకే మూవీలో బాలయ్య.. మోక్షజ్ఞ.. దర్శకుడు ఎవరో తెలిస్తే షాక్ కావాల్సిందే..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అఖండ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


ఇది ఇలా ఉంటే బాలయ్య తాజాగా మరో మూవీ ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య తన తదుపరి మూవీ ని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో బాలకృష్ణతో పాటు తన తనయుడు అయినటువంటి మోక్షజ్ఞ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో బాలయ్య , మోక్షజ్ఞ కలిసి నటించబోతున్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. ఒక వేళ నిజం గానే బాలయ్య , మోక్షజ్ఞ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో కలిసినట్లయితే ఆ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.


ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి  విజయాన్ని అందుకుంది. దానితో మరో సారి బాలకృష్ణ , క్రిష్ జాగర్లమూడి కాంబోలో మూవీ రాబోతుంది అని వార్తలు వస్తూ ఉండడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: