ఆ తీర‌ని కోరిక‌ను మేజ‌ర్ చంద్ర‌కాంత్‌తో తీర్చుకున్న ఎన్టీఆర్‌... !

RAMAKRISHNA S.S.
నాటి బ్రిటిష్‌ పాలకులను గజగజ వణికించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథను తెరకెక్కించాలనేది ఎన్టీఆర్ చిర‌కాల కోరిక‌. ఆ కోరిక తీర‌కుండానే ఆయ‌న సినిమా జీవితం ముగిసింది. అల్లూరిపై ఆ రోజుల్లో పడాల రామారావు రచించిన నాటకం విస్తృత ప్రచారంలో వుండేది. అతనికే ఈ సినిమా స్క్రిప్టు రాసే బాధ్యతలను ఎన్టీఆర్ అప్పగించారు. ఈ క్ర‌మంలోనే వాహినీ స్టూడియోలో అల్లూరి సీతారామ రాజు సినిమా కోసం తొలి పాటను 1957 జనవరి 17న రికార్డు చేశారు. ‘హర హర హర మహా ఓంకార నాదాన... పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా’ అంటూ సాగే ఈ పాటను పడాల రామారావు రాశారు. సీతా రామరాజు సమకాలికుడు మల్లుదొర అప్పట్లో పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపి కొన్ని స‌ల‌హాలు తీసుకున్నారు. అయితే స్క్రిఫ్ట్‌లో కొన్ని డౌట్లు రావ‌డంతో మ‌రింత ప‌రిశోధ‌న కావాల‌నుకుని ఆ సినిమాను ప‌క్క‌న పెట్టేసి పాండురంగ మహాత్మ్యం చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా కూడా 1957 నవంబర్‌ 28న విడుదలై విజయవంత మైంది.


ఈలోగా అల్లూరి సీతారామరాజు కథలో స్త్రీ పాత్రలు ఉండకపోవడంతో వాటిని క్రియేట్ చేస్తే అవాస్త‌విక‌త‌కు చోటు ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని భావించి.. సీతారామ క‌ళ్యాణం తీస్తే అది కూడా పెద్ద హిట్ అయ్యింది. ఈ లోగా దేవ‌దాసు నిర్మాత‌ డి.ఎల్‌. నారాయణ సీతారామరాజు కథను శోభన్‌ బాబును హీరోగా పెట్టి తీద్దామని స్క్రిప్టు తయారు చేయించారు. ఆర్థిక ప‌రిస్థితి బాగోలేక ఈ స్క్రిఫ్ట్ హీరో కృష్ణ‌కు ఇవ్వ‌డంతో త్రిపురనేని మహారధి చేత మాటలు రాయించి ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా చేయ‌డంతో అది పెద్ద హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత కూడా ఎన్టీఆర్‌కు ఈ పాత్ర‌పై మోజు త‌గ్గ‌క‌పోవ‌డంతో ప‌రుచూరి బ్ర‌దర్స్‌ను పిలిచి స్క్రిఫ్ట్ రాయ‌మ‌న్నారు. ఆ త‌ర్వాత కృష్ణ కోరిక మేర‌కు సీతారామ‌రాజు సినిమా చూశారు. ఆయ‌న క‌న్నా ఈ సినిమా ఎవరూ బాగా తీయలేరనే నిర్ణయానికి వచ్చి సీతారామరాజు సినిమా నిర్మించే విషయాన్ని విరమించుకున్నారు. అయితే ఎన్టీఆర్‌కు ఎలాగైనా ఈ పాత్ర వేయాల‌న్న బ‌ల‌మైన కోరిక ఉండ‌డంతో స‌ర్దార్ పాపారాయుడు, మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాల్లో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఎన్టీఆర్ కాసేపు దర్శనమిచ్చారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: