పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను మొదలు పెట్టిన తర్వాత భీమ్లా నాయక్ , బ్రో అనే సినిమాలను మొదలు పెట్టి ఆ మూవీలను పూర్తి కూడా చేశాడు. ఈ రెండు మూవీ లు ఎప్పుడో విడుదల అయ్యాయి. కానీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మాత్రం చాలా స్లో గా ముందుకు సాగుతుంది. కొన్ని సార్లు ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దానితో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి క్రిష్ జాగర్లమూడి కూడా ఈ సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత కొండ పొలం అనే మూవీ ని కూడా పూర్తి చేసి విడుదల చేశాడు.
ఈ మూవీ ఎంతకు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలను స్వీకరించాడు. ఇకపోతే ఈ సినిమాను మే 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా 30 వ తేదీన విడుదల అవుతుందా ..? లేదా అనే సస్పెన్స్ జనాల్లో నెలకొంది. ఇకపోతే ఇప్పటికే మే 30 వ తేదీన విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న కింగ్డమ్ అనే సినిమాను కూడా మే 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఒక వేళ మే 30 వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ఖచ్చితంగా విడుదల అవుతుంది అనుకుంటే కింగ్డమ్ సినిమా విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో నాగ వంశీ ఉన్నట్లు , లేనట్లయితే మే 30 వ తేదీనే ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.