అక్కడ ఇప్పటికి సత్తా చాటుతున్న పుష్ప 2..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప ది రూల్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్లో నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగం పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


అలా భారీ అంచనాల నడుమ పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే అద్భుతమైన అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల అయిన కొన్ని రోజులకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ కి థియేటర్లలో ఏ రేంజ్ రెస్పాన్స్ లభించిందో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.


దానితో ఈ సినిమా ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటికి కూడా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో ట్రేండింగ్లో కొనసాగుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాకు 9.4 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ ఇప్పటికి కూడా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అద్భుతమైన రీతిలో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: