నా పరిస్థితి నా కూతురికి రాకూడదు.. నటి ఊర్వశి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో ఊర్వశి ఒకరు. తల్లి పాత్రలు, కామెడీ పాత్రల ద్వారా ఈ నటి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా క్రేజ్ పెంచుకున్న ఈ నటి సౌత్ లో వందల సంఖ్యలో సినిమాలలో యాక్ట్ చేశారు. ఊర్వశి దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఊర్వశి భర్త శివప్రసాద్ కూడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
శివ ప్రసాద్ దర్శకుడిగా ఎల్.జగదాంబ 7th క్లాస్ బి అనే సినిమా చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ సెట్స్ లో అడుగుపెట్టాక నేను నటిని మాత్రమేనని డైరెక్టర్ నా భర్తే కదా అని రిలాక్స్ అయిపోనని చెప్పుకొచ్చారు. కెమెరా ముందు నా భర్త చెప్పినట్టు నటించడమే నా పని అని ఆమె కామెంట్లు చేశారు.
 
సినిమాల వల్ల తాను మధ్యలోనే చదువు మానేశానని నా కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నానని ఊర్వశి తెలిపారు. ముందు తన చదువు పూర్తి చేయమని మంచి ఉద్యోగం సంపాదించమని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. తర్వాతే సినిమాలపై ఆసక్తి ఉంటే ఇండస్ట్రీకి రావాలని ఆమె కామెంట్లు చేశారు. ఈ మధ్యి నా కూతురు చదువు పూర్తైందని ఊర్వశి అభిప్రాయపడ్డారు.
 
2000 సంవత్సరంలో నటుడు మనోజ్ జయన్ ను ఊర్వశి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు తేజ లక్ష్మి సంతానం కాగా మనోజ్ తో విబేధాలు రావడంతో అతడి నుంచి ఊర్వశి విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2013 సంవత్సరంలో శివ ప్రసాద్ ని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇషాన్ అనే కొడుకు ఉన్నారు. కూతురు తేజ లక్ష్మి మాత్రం తన తండ్రి మనోజ్ తో కలిసి ఉంటోంది. ఊర్వశి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: