సమంత పెట్ తో శోభిత.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇదిలా ఉండగా ఇటీవలే నటుడు నాగచైతన్య నటి శోభితా ధూళిపాళ్ళని అన్నపూర్ణ స్టూడియోస్ లో రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నాగచైతన్య చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత చైతు తండాల్ మూవీలో నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఎవరికివారు బ్రతుకుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా హీరో నాగచైతన్య ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో సమంత పెట్ హాష్ తో శోభితా ధూళిపాళ్ళ కలిసి దిగిన ఫొటోస్ ని షేర్ చేశారు. దానికి సండే ఎవ్రీథింగ్ అని క్యాప్షన్ కూడా జత చేశారు.
ఇక ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ అది సమంత పెట్ హాష్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరు చైతన్య లాగే హాష్ కూడా డివోర్స్డ్ చైల్డ్ అంటూ పెడుతుంటే.. మరికొందరేమో రేపు సమంత పుట్టినరోజు తన ఆనందానికి అడ్డుకట్ట వేయడానికి చైతు ఇలా చేశాడని అంటున్నారు. తన ఫేవరెట్ పెట్ తో శోభితా ధూళిపాళ్ళ కలిసి దిగిన ఫోటోలను పెట్టాడని ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.