పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్
మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్
మూవీ 'ది
రాజా సాబ్' ఒకటి. టాలెంటెడ్
డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్
ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో త్వరలో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ
సినిమా ను ముందుగా ఏప్రిల్ 10 న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం,సీజి వర్క్ పెండింగ్ లో ఉండటం వల్ల ఈ
సినిమా రిలీజ్ వాయిదా పడింది.. త్వరలోనే ఈ
సినిమా నూతన రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించనున్నారు..
ఈ
సినిమా లో హాట్ బ్యూటీస్
నిధి అగర్వాల్, మాళవికా మోహనన్
హీరోయిన్స్ గా నటించారు..స్టార్ మ్యూజిక్
డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. ఇదిలా ఉంటే ఈ
సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి
డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..ఓ ఆటోరిక్షాపై రాజాసాబ్లోని
ప్రభాస్ ఫోటో ఉండటాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు ఆయన 'అలర్ట్.. వేడి గాలులు మే లో మరింత పెరగనున్నాయి' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
దీంతో త్వరలోనే 'రాజా సాబ్' నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ ఈ సినిమాతో పాటు హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే
సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో
ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నాడు.. అలాగే క్యూట్
బ్యూటీ ఇమాన్వి ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది..