సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అందం, అభినయం, నటనా, టాలెంటు ఉంటే సరిపోదు. మనం ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం, ఓపిక తప్పనిసరిగా ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ఇండస్ట్రీలో మనం ముందుకు వెళ్లగలుగుతాం.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి మంచి గుర్తింపు పొందిన వారిలో చిరంజీవి ఒకరు.. ఈయన ఇప్పటికీ ఏడు పదుల వయస్సు దాటినా కానీ సినిమాల్లో నటిస్తూ యువ హీరోలకు పోటీగా వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం చిరంజీవి ఏ సినిమా కమిట్మెంట్ అయిన చిన్న దర్శకుడైన పెద్ద దర్శకులు అయినా వాళ్ళు చెప్పిందే వింటారు. షూటింగ్ సెట్లోకి వెళ్ళాడు అంటే దర్శకుల మాట కాదని ఇంకే పని చేయడు. అలా ఉన్నాడు కాబట్టే ఆయనకు అంతటి పేరు వచ్చింది.
కానీ ఒకసారి మోహన్ బాబు చేసిన పనికి దర్శకుడు హర్ట్ అయిపోయి సినిమా నుంచి తీసేశాడు. ఆ మూవీ ఏంటి వివరాలు చూద్దాం.. 1984లో చిరంజీవి హీరోగా కే బాపయ్య డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇంటిగుట్టు అందరికీ తెలుసు. ఈ సినిమాలో సుహాసిని, నలిని హీరోయిన్స్ గా చేశారు. అలాంటి ఈ చిత్రంలో ముందుగా మోహన్ బాబుని హీరోగా తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేశారట. అలా కొంతకాలం షూటింగ్ అయిన తర్వాత బాపయ్య గారితో మోహన్ బాబు ఓ రోజు మాట్లాడానికి వెళ్లగా, ఆయన కాస్త బిజీగా ఉండడం వల్ల మోహన్ బాబును వేచి ఉండాలని అన్నారట.
దీంతో హర్ట్ అయిన మోహన్ బాబు నన్నే వేచి ఉండమంటావా అనుకోని అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఆ తర్వాత బాపయ్య మోహన్ బాబునీ రమ్మని కబురు పెట్టడంతో ఆయన అక్కడ లేకపోవడంతో కోపానికి వచ్చిన బాపయ్య అప్పటికప్పుడే మోహన్ బాబు సినిమా నుంచి తీసేసారట. వెంటనే చిరంజీవిని హీరోగా ప్రకటించారు. ఆ తర్వాత చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకుని, రిలీజ్ చేశారు. ఈ చిత్రం భారీ హీట్ అందుకుంది. అంతేకాదు దీనికి ఫిలింఫెర్ అవార్డు కూడా దక్కింది.