
షాక్: దేవి శ్రీప్రసాద్ కు షాక్ ఇచ్చిన ఏపీ పోలీస్..!
ఈనెల 19వ తేదీన విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో ఒక మ్యూజికల్ కాన్సెప్ట్ కు సంబంధించి దేవిశ్రీప్రసాద్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం పోలీసులు అనుమతిని పొందడం కోసం ప్రయత్నించగా పోలీసులు అనుమతిని నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ షో కి సంబంధించి ఆన్లైన్లో భారీగా టికెట్లు కూడా అమ్ముడుపోయాయట. భద్రతా కారణాల చేత దేవిశ్రీప్రసాద్ నిర్వహిస్తున్నటువంటి ఈ మ్యూజికల్ కాన్సెప్ట్ కి అనుమతి ఇవ్వలేమంటూ ఏపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. అయితే విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో వాటర్ వరల్డ్ లో బాలుడు కూడా మరణించిన సంఘటన నేపథ్యంలోనే అక్కడ దేవిశ్రీప్రసాద్ కు మ్యూజికల్ కాన్సెప్ట్ చేయడానికి అనుమతి ఇవ్వలేదనే విధంగా తెలుస్తోంది. అయితే మొత్తానికి ఎంతోమంది అభిమానులు ఎదురు చూసి టికెట్లు కూడా కొన్న తర్వాత ఇలా షో క్యాన్సిల్ అవ్వడంతో చాలా మంది నిరాశపడుతున్నారు.
మరి ఇందుకు సంబంధించి తదుపరి నిర్ణయం మ్యూజిక్ డైరెక్టర్ దేశ శ్రీప్రసాద్ ఏ విధంగా తీసుకుంటారనే విషయపైన తెలియాల్సి ఉన్నది.. దేవిశ్రీప్రసాద్ పుష్ప , పుష్ప 2 చిత్రాలకు అద్భుతమైన పాటలు అందించడమే కాకుండా మ్యూజిక్ కూడా అందించడంతో భారీ విజయానికి కారణమయ్యింది. దీంతో ఇతర భాషలలో కూడా దేవిశ్రీప్రసాద్ కి భారీగా క్రేజ్ పెరిగి మరి అవకాశాలు వెలబడుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు దేవిశ్రీప్రసాద్.