
అంత సేమ్ టు సేమ్ .. నార్త్‌లో సౌత్ దర్శకుల సక్సెస్ ఫార్ములా ఇదే..!
ఈ చిన్న పాయింట్ కోసమే ఓ ఏరియా ను శాసించే విలన్‌లను ఎదుర్కొంటాడు మన హీరో .. ఇక ఇప్పుడు జాట్ సినిమాలో కూడా అలాంటి ఓ సిల్లీ పాయింట్ వల్లే హీరో విలన్ మధ్య యుద్ధం జరుగుతుంది .. హీరో తినే ఇడ్లీ ప్లేట్ పడేసిన విలన్లు సారీ చెప్పకపోవడంతో ఒక్కొక్కరిని కొట్టుకుంటూ మెయిన్ విలన్ దగ్గరకు వెళ్తాడు హీరో .. అక్కడ కూడా విలన్ ఏరియా ను శాసించే రేంజ్ లో ఉంటాడు . ఇక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా తనకు సౌత్లో వర్క్ అవుట్ అయిన ఫార్ములానే నార్త్ లో అప్లై చేసుకున్నాడు .. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రేమించిన అమ్మాయి ప్రేమ కోసం హీరో వైలెంట్ గా బిహేవ్ చేస్తాడు హీరో .
యనిమల్ సినిమాలోను తండ్రి మీద ప్రేమతో వైలెంట్ గా మారుతాడు హీరో .. ఇలా మన సౌత్లో వర్కౌట్ అయిన ఫార్ములాస్ గట్టి మసాలాతో జోడించి బాలీవుడ్ ప్రేక్షకులకు చూపించి విజయాలు అందుకుంటున్నారు మన దర్శకులు . మరో సౌత్ దర్శకుడు అట్లీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు .. ఇక తనకు సౌత్లో బాగా కలిసి వచ్చిన తండ్రి సెంటిమెంట్ తోనే నార్త్ లు సినిమా చేశారు .. తెరి , మెర్సల్ సినిమాలో తండ్రి సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయి సినిమాలను సక్సెస్ చేసింది .. అదే రూటు జవాన్ లో కూడా ఫాలో అయి 1000 కోట్ల కలెక్షన్లు అందుకున్నాడు. ఇలా మన దర్శకులు సౌత్ లో ఏ రూట్ ను ఫాలో అయ్యారో అదే రూట్ లో బాలీవుడ్ లో విజయం సాధిస్తూ దూసుకుపోతున్నారు .